- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ జెడ్పీటీసీ టీఆర్ఎస్లో చేరిక..!
by Shyam |
<p>దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జెడ్పీటీసీ ఉషాగౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం పార్టీలో చేరినట్లు ఉషా గౌడ్ తెలిపారు. కాగా, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎల్లారెడ్డికి చెందిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండగా.. అక్కడి సిట్టింగ్ జెడ్పీటీసీ పార్టీ మారడం […]</p>

X
దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జెడ్పీటీసీ ఉషాగౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అదివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం పార్టీలో చేరినట్లు ఉషా గౌడ్ తెలిపారు.
కాగా, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎల్లారెడ్డికి చెందిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉండగా.. అక్కడి సిట్టింగ్ జెడ్పీటీసీ పార్టీ మారడం కలకలం రేపుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన సరేందర్ టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ స్థానిక సంస్థల సభ్యులు ఒక్కొక్కరు పార్టీ వీడడం కాంగ్రెస్ పార్టీకి దెబ్బగా చెప్పవచ్చు.
Next Story






