కాంగ్రెస్‌కు షాక్… కరోనాతో కీలక నేత మృతి..

164

దిశ నర్సాపూర్ : కరోనా వ్యాధితో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మి రవీందర్‌రెడ్డి గురువారం నాడు రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మృతి చెందారు. లక్ష్మీ రవీందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమె తెలంగాణ రాష్ట్రసమితిలో పనిచేసారు. అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరకు విరమించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున నర్సాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం ఆమె నరసాపురం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమెది నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండలం పైతర స్వగ్రామం. గత కొన్ని రోజులుగా ఆమె కరోనా వ్యాధి సోకడంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హాస్పటల్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు. లక్ష్మీ మృతి పట్ల నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలతో పాటు ఆయా పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..