ప్రభుత్వ విధానాలను ఎండగట్టండి

by Ramesh Goud |

<p>దిశ, ఎల్బీనగర్: ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు ఆయన తెలిపారు. చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడిగా ముస్కు శేఖర్ రెడ్డి, లింగోజిగూడ [&hellip;]</p>

ప్రభుత్వ విధానాలను ఎండగట్టండి
X

దిశ, ఎల్బీనగర్: ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు ఆయన తెలిపారు. చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడిగా ముస్కు శేఖర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడిగా మల్లారపు శ్రీనివాస్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడిగా శశిధర్ రెడ్డి, కొత్తపేట్ డివిజన్ అధ్యక్షుడిగా లింగాల కిషోర్ గౌడ్, హస్తినాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా దేంది శశిధర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా బుడ్డా సత్యనారాయణలను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని మిగిలిన రెండు డివిజన్ల అధ్యక్షులను కార్యకర్తలతో చర్చించి త్వరలో నియమిస్తామన్నారు.

Next Story