- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు షాక్.. ‘కారు’ఎక్కిన కీలక నేత
<p>దిశ, కొత్తగూడ : స్థానిక మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి మూడేండ్ల కిందట ఎంపీటీసీగా గెలుపొందినప్పటికీ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నానని మనోవేదనకు గురై ఓ ఎంపీటీసీ TRS తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంఘటన కొత్తగూడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైరబోయిన సదానందం పోగులపల్లి ఎంపీటీసీగా గతంలో ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉండటంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయానని, ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. […]</p>

దిశ, కొత్తగూడ : స్థానిక మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి మూడేండ్ల కిందట ఎంపీటీసీగా గెలుపొందినప్పటికీ మండలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నానని మనోవేదనకు గురై ఓ ఎంపీటీసీ TRS తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సంఘటన కొత్తగూడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైరబోయిన సదానందం పోగులపల్లి ఎంపీటీసీగా గతంలో ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ఉండటంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయానని, ప్రజల కోరిక మేరకు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఓ.డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దేశిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ TRS మండల అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, కొత్తగూడ TRS అధికార ప్రతినిధి జవహర్ లాల్ నెహ్రు, మండల TRS ప్రధాన కార్యదర్శి ఈసం సాయి కిరణ్, సాదిరెడ్డిపల్లి ఎంపీటీసీ మనుబోతుల స్వప్న లింగన్న యాదవ్, కొత్తగూడ ఎంపీటీసీ హలవాత్ సాలుకి సురేష్, సల్లురి సారంగపాణి పాల్గొన్నారు.






