కేసీఆర్ డబ్బులు మోయడమే ‘పల్లా’ పని : ఉత్తమ్

by  |
MP Uttam Kumar Reddy
X

దిశ, కోదాడ/దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన పని ఒక్కటీ లేదని.. ఈ ఆరేళ్ల కాలంలో ఆయన చిన్న కాలేజీ స్థాయి నుంచి హైదరాబాదులో పారిశ్రామికవేత్తగా ఎదిగాడని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోదాడ, హుజూర్ నగర్ ఎన్నికల్లో కేసీఆర్ డబ్బుల సంచులు మోయడం, ఆయన దగ్గర గులాంగిరి చేయడం తప్ప నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనర్లకు పల్లా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాములు నాయక్ ఓల్డ్ తెలంగాణ బ్యాచ్ అని.. రాజేశ్వర్ రెడ్డి బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఘాటుగా విమర్శించారు. భృతి విషయంలో నిరుద్యోగులను, పీఆర్సీ విషయంలో ఉద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

కల్వకుంట్ల కుటుంబమే బాగుపడింది..

తెలంగాణ రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. టీపీసీసీ ఫిషర్మెన్ విభాగం చైర్మన్ మెట్టు సాయికుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్​ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొలువులు లేక చాలా మంది ఆర్ధాకలితో ఉంటున్నారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పాలన్నారు. దేశాన్ని మతపరంగా విభజించి లాభాలు పొందడం తప్ప బీజేపీ ప్రజలకు చేస్తున్నది ఏమీలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొల్లు కిషన్, నగేష్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed