కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

113

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వాసవి నగర్‌లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రజాప్రతినిధులు సమయం కంటే ముందే ప్రారంభించి వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక అధికారులతో రేవంత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డిని విమర్శించారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..