‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వయసైపోయింది’

by  |
‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వయసైపోయింది’
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని, అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని అన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వయస్సు సహకరించడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను చేయాలని పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని విమర్శించారు. అంతేగాకుండా గిరిజన రిజర్వేషన్లు 10 శాతం కుడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ రాజ్యాంగ నిబంధన ఉల్లంఘిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Next Story