కేంద్ర ఆర్థిక మంత్రికి ‘పెట్రో’ సెగ..

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ముంబైలోని యోగి సభగ్రాహ్‌కు ఆమె చేరుకోగా.. కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 400 నుంచి 500 మంది నల్ల జెండాలు ప్రదర్శిస్తూ కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఇంధన ధరలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, నిరసన ప్రక్రియ శాంతియుతంగా జరిగిందని.. ఎవరినీ నిర్భంధించడం, వారిపై FIR నమోదు చేయడం [&hellip;]</p>

కేంద్ర ఆర్థిక మంత్రికి ‘పెట్రో’ సెగ..
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ముంబైలోని యోగి సభగ్రాహ్‌కు ఆమె చేరుకోగా.. కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 400 నుంచి 500 మంది నల్ల జెండాలు ప్రదర్శిస్తూ కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఇంధన ధరలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, నిరసన ప్రక్రియ శాంతియుతంగా జరిగిందని.. ఎవరినీ నిర్భంధించడం, వారిపై FIR నమోదు చేయడం వంటివి జరగలేదని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Next Story