‘కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి’

by  |
‘కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి’
X

దిశ ,సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమిరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని, లేదా బదిలీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీసం నాగరాజు యాదవ్ మాట్లాడుతూ… ఈ దుబ్బాక ఉపఎన్నికల సమయంలో గత వారం రోజులుగా వివిధ పత్రికల్లో, టీవీ ఛానెల్‌లలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వార్తలు ప్రచారం జరుగుతోందన్నారు.

బాధ్యత గల పదవిలో ఉండి కూడా కనీసం వివరణ కూడా ఇవ్వలేదని, ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులకు, ప్రజలకు అనేక అనుమానాలకు తావిస్తాయన్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు సుజావుగా, పక్షపాతం లేకుండా జరిగేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఫిర్యాదులో కోరామన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, లేదా బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story