- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్నబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఫిర్యాదు
<p>దిశ, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీపైన, సోనియా గాంధీపైన అనవసర టీవీ చర్చ నిర్వహించి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆర్నబ్ గోస్వామిపైన, రిపబ్లిక్ టీవీపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణులు నగరంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్నబ్ గోస్వామి జర్నలిజానికి పనికిరాడని, జర్నలిస్టుల విలువల్ని దిగజార్చే విధంగా ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. […]</p>

X
దిశ, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీపైన, సోనియా గాంధీపైన అనవసర టీవీ చర్చ నిర్వహించి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆర్నబ్ గోస్వామిపైన, రిపబ్లిక్ టీవీపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశ వేణులు నగరంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్నబ్ గోస్వామి జర్నలిజానికి పనికిరాడని, జర్నలిస్టుల విలువల్ని దిగజార్చే విధంగా ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు. ఒక మతతత్వ వాదిగా టీవీ చర్చలు నిర్వహిస్తున్న ఆయన్ను వెంటనే జర్నలిస్టు సంఘాలు బహిష్కరించాలన్నారు. ఇలాంటి దేశద్రోహుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags : Congress leaders, complaint, Arnab Goswami, tv program, nizamabad
Next Story






