మేయర్‎ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

8

దిశ, హన్మకొండ: వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ రావును కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా హన్మకొండ అమరావతి నగర్ కాలనీలో వరద నీరు చేరింది. ఈ మేరకు పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మేయర్‎ను కాంగ్రెస్ నేతలు స్థానికులు అడ్డుకున్నారు. బాక్స్ డ్రైనేజీకి మంత్రి కేటీఆర్ రూ.10 కోట్లు ఇచ్చినా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపిస్తూ మేయర్ వాహనం వెళ్లకుండా నిరసనకు దిగారు. నీట మునిగిన మిగతా కాలనీలను పరిశీలించాలని, సమ్మయ్య నగర్ కాలనీలో శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.