- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు బీజేపీలో చేరనున్న రాములమ్మ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్టు ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితర నేతలు చర్చలు జరిపారు. ఓవైపు విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తుండగా.. మరోవైపు అలాంటిది ఏమీ లేదని, ఆ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ వార్తలకు డిసెంబర్ 7వ తేదీ సోమవారం పుల్‌స్టాప్ పడనుంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్టు ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే విజయశాంతితో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితర నేతలు చర్చలు జరిపారు. ఓవైపు విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తుండగా.. మరోవైపు అలాంటిది ఏమీ లేదని, ఆ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ వార్తలకు డిసెంబర్ 7వ తేదీ సోమవారం పుల్‌స్టాప్ పడనుంది. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానుంది. అంతేగాకుండా ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.
Next Story






