ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం : వీహెచ్

12

దిశ, వెబ్‌డెస్క్ : దుబ్బాక ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు అన్నారు. రాష్ట్రస్థాయి నేతలను దుబ్బాకలోనే ఉండాలని కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి ఠాగూర్ చెప్పారన్నారు. కానీ, కొంతమంది నేతలు నియోజకవర్గంలో ఉండటం లేదని ఓ ప్రముఖ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీహెచ్ వివరించారు.

కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలను కలుపుకుని పోవాలని ఆయన సూచించారు. అలాగే కాంగ్రెస్ విజయానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు.