- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్లు కలిసికట్టుగా ఉంటే మోడీని ఢీకొట్టవచ్చు : శశి థరూర్
<p>దిశ, పటాన్‌చెరు : విపక్ష పార్టీల ఐక్యత తప్పనిసరి అని.. అవన్నీ ఒక తాటికి మీదకు వచ్చి ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళు కలిసికట్టుగా పోరాడితే మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఎదుర్కొనవచ్చని లోక్‌సభ సభ్యుడు, రచయిత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా శనివారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖీలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు, […]</p>

దిశ, పటాన్‌చెరు : విపక్ష పార్టీల ఐక్యత తప్పనిసరి అని.. అవన్నీ ఒక తాటికి మీదకు వచ్చి ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళు కలిసికట్టుగా పోరాడితే మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఎదుర్కొనవచ్చని లోక్‌సభ సభ్యుడు, రచయిత, మాజీ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు. గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా శనివారం గీతం విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖీలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు, విస్తరణ డైరెక్టర్ నిధి రజ్జాని సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోడీ రెండు సార్లు 31, 37 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారని, ప్రతికూల ఓట్లే పెద్ద సంఖ్యలో (69, 63 శాతం) ఉన్నాయన్నారు. అంతేకాక ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగ రేటు విపరీతంగా పెరగడం, కొవిడ్-19 సిచువేషన్‌ను సరిగా ఎదుర్కోలేదన్నారు. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు లేక చాలా మంది మరణించారని గుర్తు చేశారు. రైతుల ఆందోళనపై కేంద్రం అతి చేసిందని చెప్పారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నరేగా, జనధన్ వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిన చరిత్ర ఉండనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మమతాబెనర్జీ కలిసి రావడంపై ఆయన విశ్వాసం వ్యక్తపరుస్తూ, ఆమె తమతో అధిక కాలం కలిసి పనిచేసిందని, ఎన్నో అంశాలలో భావసారూప్యం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో ఇబ్బందిపడిన మమతా ఇటీవల ఎన్నికలలో కాంగ్రెస్ పట్ల ఆమె వ్యక్తపరిచినట్టు చెప్పారు. సోషల్ మీడియా ప్రజల ఆలోచనా తీరుపై ప్రభావం చూపుతోందని, అధికారంలో ఉన్నవారు దానిని కాపాడుకోవడం కోసం అనుకూల అంశాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ప్రజల ఆలోచన తీరులో మరీ ముఖ్యంగా ఉత్తర భారతీయుల ఆలోచనా తీరులో మార్పు రావాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. దాదాపు 45 ట్రిలియన్ డాక్టర్ల భారత దేశ సంపదను 200 ఏళ్ళ ఆంగ్లేయ పాలనలో కొల్లగొట్టారని, అభివృద్ధి చెందిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న మనం వెనుకబాటుకు లోనయ్యామన్నారు. 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని, 27 ఏళ్ళు సగటు జీవన ప్రమాణంగా ఉందని విచారం వ్యక్తం చేశారు.
మనదేశంలోని కొన్ని ప్రాంతాలు బాగా వృద్ధి సాధించాయని.. హార్డ్‌వేర్, నౌకాశ్రయాలు, రైల్వే, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పారిశుధ్యం, ప్రజారోగ్యాలను కూడా వృద్ధి చేసుకోవాలని సూచించారు. ఓ సగటు భారతీయుడు అనారోగ్యం పాలైతే ఐదు కిలోమీటర్ల లోపు వెద్య సదుపాయం లేదని, 26-27 శాతం మంది మాత్రమే కళాశాల విద్యను అభ్యసించగలగుతున్నారని, విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేయడంతో పాటు ప్రతీ భారతీయుడు మూడు పూటలా తిని, సొంత ఇంట్లో ఉంటూ, తమ పిల్లలకు మంచి చదువు, గౌరవ వేతనం కూడిన ఉపాధి అందితే మనం కూడా వృద్ధి చెందవచ్చని విశ్లేషించారు. తన బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్య, దేశంలోని పలు ప్రాంతాలలో నివాసం, విద్యార్థి దశ, ఎమర్జెన్సీలో వ్యవహరించిన తీరు, కాంగ్రెస్ పార్టీలో చేరికతో పలు వివాదస్పద ట్వీట్లు వంటి వాటిని వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ రాయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.






