మంత్రులకు సంపత్ సవాల్

by Shyam |
మంత్రులకు సంపత్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలు అడుతుందని, పైశాచిక ఆనందం పొందుతుందని మంత్రుల కేటీఆర్, ఈటల అనడం పట్ల మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే.. మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతున్నారని, పైశాచికం ఎవరిదని ప్ర‌శ్నించారు. బాధ్యత గల మంత్రులు బాధ్యతలు విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నార‌న్నారు.

బుధ‌వారం రాష్ట్రంలో 1920 కరోనా కేసులు వచ్చినట్టు, 11 మంది చనిపోయినట్టు ప్రకటించిన బులెటిన్‌లో వైర‌స్‌తో చ‌నిపోయిన వారి పేర్లు ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. మరణాలు ఎక్కువ ఉన్నట్టు నిరూపిస్తాన‌ని ఇద్దరు మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు సంప‌త్. కరోనో బాధితులు, మృతుల వివరాలు పేర్లతో సహా బయటపెట్టాల‌ని..ఎవరివి అబద్ధాలో తేల్చుకుందామ‌ని అన్నారు. కరోనా కేసులు, మృతుల విష‌యంలో మీరు చెప్పేవి అబద్దాలని తేల్చకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటాన‌ని అన్నారు.

వైర‌స్ మ‌హామ్మారితో జనం చనిపోతుంటే నివారించడంలో విఫల‌మై పైశాచిక ఆనందం పొందుతూ.. టీఆర్ఎస్ మంత్రులు అబద్దాలు ప్రచారం చేస్తున్నార‌న్నారు. క‌రోనా బాధితులు, మృతుల వివరాలన్నీ పచ్చి అబద్ధమ‌ని.. అవ‌న్నీ దొంగ లెక్కలేన‌ని అన్నారు. “ఈరోజు న‌మోదైన‌ కరోనో లె‌క్కలు, మృతుల వివరాలు పేర్లతో సహా ప్రకటించండి. నేను మీరు చెప్పిన లెక్కలు అబద్దాలు అని సాక్షాలతో సహా నిరూపిస్తా” అని సంప‌త్ అన్నారు.

Advertisement

Next Story