- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈసీ అంటే ఎలక్షన్ కమీషన్: రాహుల్ గాంధీ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మపై ఆంక్షల సడలింపు, బీజేపీ ఎమ్మె్ల్యే కారులో ఈవీఎంలు లభించిన ఘటనపై తీసుకున్న చర్యలపై ఆయన అసహనాన్ని ట్విట్టర్‌లో వ్యక్తపరిచారు. ఎన్నికల కమిషన్‌ను ‘ఎన్నికల కమీషన్’గా పేర్కొన్నారు. ఈసీ నిష్పక్షపాతంపై ఇటీవలే కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ప్రతిపక్ష నేతను జైలుకు పంపిస్తానని బెదిరించిన హిమంత బిశ్వ శర్మ ప్రచారం చేయకుండా తొలుత 48 గంటలపాటు నిషేధం […]</p>

X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మపై ఆంక్షల సడలింపు, బీజేపీ ఎమ్మె్ల్యే కారులో ఈవీఎంలు లభించిన ఘటనపై తీసుకున్న చర్యలపై ఆయన అసహనాన్ని ట్విట్టర్‌లో వ్యక్తపరిచారు. ఎన్నికల కమిషన్‌ను ‘ఎన్నికల కమీషన్’గా పేర్కొన్నారు. ఈసీ నిష్పక్షపాతంపై ఇటీవలే కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ప్రతిపక్ష నేతను జైలుకు పంపిస్తానని బెదిరించిన హిమంత బిశ్వ శర్మ ప్రచారం చేయకుండా తొలుత 48 గంటలపాటు నిషేధం విధించిన ఈసీ అనంతరం దాన్ని సగానికి అంటే 24 గంటలకు కుదించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే వాహనంలో ఈవీఎంలు లభించిన ఘటనపై ఈసీ తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ ఈ నెల 2న విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం కారు ఖరాబ్, బీజేపీ నీతి ఖరాబ్, ప్రజాస్వామ్య పరిస్థితి ఖరాబ్ అంటూ ట్వీట్ చేశారు.
Next Story






