కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. ఆహ్వానించిన మల్‌రెడ్డి

by  |
Congress leader Malla Reddy Ranga Reddy
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం ఇనామ్‌గూడ‌, గౌరెల్లి గ్రామాల టీఆర్ఎస్‌, బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన కార్యక‌ర్తలు భారీగా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేసే విధంగా నేత‌లు, కార్యక‌ర్తలంతా ఉత్సాహం చూపుతున్నార‌ని అన్నారు. కేసీఆర్ స‌ర్కార్ అవ‌లంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలు వారికే శాపంలా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీపీ బుర్ర రేఖ మ‌హేంద‌ర్‌గౌడ్‌, అంత‌టి సుధాక‌ర్‌గౌడ్‌, ఇనామ్‌గూడ స‌ర్పంచ్ అంత‌టి య‌శోద త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed