- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో మోసానికి తెరలేపిన టీఆర్ఎస్.. అప్రమత్తంగా ఉండండి
<p>దిశ, అశ్వారావుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీటార్ గారడీ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మాసనపల్లి లింగోజి విమర్శించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో ‘దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా లింగోజి పాల్గొని మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసి, ప్రస్తుతం ‘దళితబంధు’ పేరుతో మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో ఎన్నో దళిత, గిరిజన […]</p>

దిశ, అశ్వారావుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీటార్ గారడీ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మాసనపల్లి లింగోజి విమర్శించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో ‘దళిత గిరిజన సత్యాగ్రహ దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా లింగోజి పాల్గొని మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసి, ప్రస్తుతం ‘దళితబంధు’ పేరుతో మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో ఎన్నో దళిత, గిరిజన కుటుంబాలను స్థితిగతులు మార్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని గిరిజనుల్లో ఎంతో మందికి పట్టాలు ఇచ్చిన ఘటన కాంగ్రెస్ పార్టీదని అన్నారు. హరితహారం పేరుతో నేడు గిరిజనుల వద్ద భూమి లాక్కుంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శనివారం జరిగిన సీతాయిగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యమే దీనికి నిదర్శనం అన్నారు. ఇద్దరు గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల లాగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా రాజీనామా చేసి నియోజకవర్గ అభివృద్ధికి దోహద పడాలని అన్నారు. ఈ దీక్షలో జెడ్పీటీసీలు కొడకండ్ల వెంకటరెడ్డి, సున్నం నాగమణి, టేకులపల్లి పీఏఎస్‌సీ చైర్మన్ లక్కినేని సురేందర్, నియోజకవర్గ నాయకులు దొందు నాయక్, బండారు మహేష్, యాదగిరి కృష్ణ, కరీం, షాబీర్ హుస్సేన్, బానోత్ భీముడు, కేశబోయిన నరసింహారావు, బడుగు వెంకటేశ్వర్లు, ఇస్లావత్ రుక్మిని, వాసం శీను, రామారావు, కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.






