ఢిల్లీలో కాంగ్రెస్ నేత వీహెచ్ దీక్ష.. ఎందుకో తెలుసా..?

by  |
Congress leader VH
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట జంక్షన్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఢిల్లీ వేదికగా దీక్షకు దిగుతున్నారు. జంతర్‌మంతర్‌లో డిసెంబరు 12న దీక్ష చేయనున్ననట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి విగ్రహ ప్రతిష్టాపన కోసం కృషి చేస్తానని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట దగ్గర పెట్టడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుని విగ్రహాన్ని తీసుకెళ్లి స్టేషన్‌లో దాచిపెట్టారని విమర్శించారు. మూడేళ్లయినా విగ్రహాన్ని ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు.

ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి, ఢిల్లీ పెద్దలకు లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. రాజ్యాంగం అమలు అయినప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అంటుండేవారని, కానీ ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతున్నది ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఒక దళిత మేధావి అయిన అంబేద్కర్‌కు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరగాలని వీహెచ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.


Next Story

Most Viewed