ఉద్యోగాల భర్తీపై హీటెక్కిన రాజకీయం

by  |
ఉద్యోగాల భర్తీపై హీటెక్కిన రాజకీయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఉద్యోగాల భర్తీపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సవాల్, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇది తప్పని నిరూపిస్తే చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. దీంతో కేటీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్వీకరించారు. కేటీఆర్ లెక్కలు తప్పని.. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రతి సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీపై చర్చించేందుకు శుక్రవారం గన్‌పార్క్ దగ్గరకు రావాలని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇవాళ నిరుద్యోగులతో దాసోజ్ శ్రవణ్ గన్‌పార్క్ వద్దకు చేరుకుని బైఠాయించారు. టీఆర్ఎస్ లక్ష ఉద్యోగాలపై చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. కాగా, కాంగ్రెస్‌తో చర్చలో పాల్గొనవద్దని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గన్‌పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


Next Story

Most Viewed