- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల ఢిల్లీ వెళ్లింది అందుకే.. దాసోజు శ్రవణ్ కామెంట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీజేపీలో చేరేందుకే ఈటల ఢిల్లీ వెళ్లాడని పలువురు విమర్శిస్తుండగా, మరికొంత మంది ఈటల నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా.. ఈటల ఢిల్లీ ప్రయాణంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోడేళ్ల డాదిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లాడని అన్నారు. ఈటల రాజేందర్‌పై పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని వెల్లడించారు. ఒత్తిడి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీజేపీలో చేరేందుకే ఈటల ఢిల్లీ వెళ్లాడని పలువురు విమర్శిస్తుండగా, మరికొంత మంది ఈటల నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా.. ఈటల ఢిల్లీ ప్రయాణంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోడేళ్ల డాదిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లాడని అన్నారు. ఈటల రాజేందర్‌పై పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని వెల్లడించారు. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే ఈటల ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఆధిపత్యం కోసం ఈటలతో పాటు.. ఆయన భార్య జమున, కొడుకు, కోడలుపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ కాదు.. ఫక్తు ఫాల్తూ పార్టీగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన వాళ్లు మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నుంచి తప్పించుకోవటానికి ఈటల బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.






