సీఎం గాడిదలు కాస్తున్నారా !: భట్టి విక్రమార్క

56

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే మాటల యుద్ధానికి దిగుతున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్‌పై కుట్ర జరుగుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని, అసలు కుట్ర జరుగుతుంటే సీఎం గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. గురువారం గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్.. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని అంటున్నారని, అసలు హైదరాబాద్‌లో ఏం జరుగుతుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటేనని, ప్రజా సమస్యలపై స్పందించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.