సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఆరోపణలు

by Ramesh Goud |

<p>దిశ, మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చి 3 ఏండ్లు గడుస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు పోరిక బలరాం నాయక్ ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12 % రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట మార్చారన్నారు. మాయ మాటలు చెప్పి [&hellip;]</p>

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఆరోపణలు
X

దిశ, మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చి 3 ఏండ్లు గడుస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు పోరిక బలరాం నాయక్ ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీలకు 12 % రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట మార్చారన్నారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బలరాం నాయక్ ఆరోపించారు.

Next Story