‘రేప్ చేయగానే ఆత్మహత్య చేసుకోవాలి’

by Shamantha N |

<p>తిరువనంతపురం: కాంగ్రెస్ కేరళ యూనిట్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఫ్ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ నిర్వహిస్తున్న ఆందోళనల్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆమె ప్రతి ఉదయం లేవగానే, తనపై అత్యాచారం జరిగిందని చెబుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తనపై అఘాయిత్యాలు జరిగాయని చెబుతూనే డ్రెస్ వేసుకుని కర్టెయిన్ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడు బయటకు రావాలా? అని తరచూ అడుగుతుంది. సీఎం నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక్కడ పనికిరావు. కేరళ ప్రజలు మీ కుత్సిత [&hellip;]</p>

‘రేప్ చేయగానే ఆత్మహత్య చేసుకోవాలి’
X

తిరువనంతపురం: కాంగ్రెస్ కేరళ యూనిట్ చీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఫ్ సర్కారు అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ నిర్వహిస్తున్న ఆందోళనల్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆమె ప్రతి ఉదయం లేవగానే, తనపై అత్యాచారం జరిగిందని చెబుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తనపై అఘాయిత్యాలు జరిగాయని చెబుతూనే డ్రెస్ వేసుకుని కర్టెయిన్ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడు బయటకు రావాలా? అని తరచూ అడుగుతుంది. సీఎం నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక్కడ పనికిరావు. కేరళ ప్రజలు మీ కుత్సిత బుద్ధిని అర్థం చేసుకుంటున్నారు. ఆత్మగౌరవమున్న మహిళ అత్యాచారానికి గురైతే ఆత్మహత్య చేసుకుంటుంది. లేదంటే అసలు రేప్ జరగకుండానే చూసుకుంటుంది. కానీ, ఆమె మాత్రం మళ్లీ రేప్ జరిగిందని గగ్గోలు పెడుతుంది. ఆమెను ముందుంచి రాజకీయాలు చేస్తున్నారని ఓ సీనియర్ పోలీసు నాకు చెప్పారు’ అని వ్యాఖ్యలు చేశారు. అనంతరం క్షమాపణలు చెప్పారు. సోలార్ స్కామ్‌లో ప్రమేయమున్నట్టుగా భావిస్తున్న ఓ మహిళపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సదరు మహిళ తనపై కాంగ్రెస్ నేత అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపించారు. కాగా, అత్యాచారం చేయడం నేరం కానీ, దాడికి గురైన మహిళ ఎలా నేరస్తురాలవుతుంది? అని రాష్ట్ర మంత్రి శైలజా విమర్శించారు.

Next Story