'చట్టప్రకారం ఒవైసీపై చర్యలు తీసుకోవాలి'

by  |
చట్టప్రకారం ఒవైసీపై చర్యలు తీసుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆసుపత్రి వైద్యులు,నర్సులు కరోనా పేషెంట్లను సరిగ్గా చూసుకోవడం లేదని ఒవైసీ చేసిన ఆరోపణలో వాస్తవం లేకుంటే కొత్త చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్లపై దాడులు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా డాక్టర్ల పై జరిగే దాడులను ఉపేక్షించమని హెచ్చరికలు చేస్తున్నాయన్నారు. కానీ, రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లీస్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ గాంధీ హాస్పిటల్ జైలు కంటే అధ్వాన్నంగా ఉందని, రోగులను డాక్టర్లు, నర్సులు సరిగా చూడటం లేదని ఆరోపించడం విస్మయం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒంటెద్దు పోకడలు మాని అన్ని పక్షాలతో చర్చించి సహాయకచర్యలు పర్యవేక్షించడానికి అఖిలపక్ష కమిటీ వేసి ప్రజలకు విశ్వాసం కలిగించాలన్నారు.

Tags: Gandhi Hospital, Doctors, Akbaruddin, nurses, Act



Next Story

Most Viewed