హత్నూరలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

by  |
హత్నూరలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
X

దిశ, హత్నూర : కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హత్నూర మండలంలో హస్తం పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిష్టయ్య కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.ఏ. హకీం మాట్లాడుతూ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయమైన, సమగ్రమైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.

దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తూ, దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ 137 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవను అందిస్తూ ప్రజా అభివృద్ధిని, శాంతిని ప్రోత్సహిస్తూ మన్ననలు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేష్, నాయకులు అల్తాఫ్, యదా గౌడ్, ఇబ్రహీం, వరిగుంతమ్ కృష్ణ రాములు, ప్రసాద్, భూమయ్య, రాములు, నర్సింలు, హసన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed