- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లన్న మాస్టర్ ప్లాన్.. మేడ్చల్‌లో కాంగ్రెస్‌కు షాక్
<p>దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన కమిటీల నియామకాల్లో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డ్ కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ రావు, ప్రకాష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల నియామకం తలనొప్పిగా మారింది. […]</p>

X
దిశ, మేడ్చల్ టౌన్ : మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన కమిటీల నియామకాల్లో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డ్ కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ రావు, ప్రకాష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల నియామకం తలనొప్పిగా మారింది. అసంతృప్తులు మమ్మల్ని సంప్రదించకుండానే కమిటీలు వేశారని మండి పడుతున్నారు. జిల్లా ప్రెసిడెంట్ నంది కంటి శ్రీధర్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కీలకనేతలు పార్టీ మారుతున్నట్టు తెలుస్తోంది.
Next Story






