- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బీ-టీమ్‌గా కాంగ్రెస్’
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖలను సృష్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందన్నారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీ.హెచ్ మాటలు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖలను సృష్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందన్నారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీ.హెచ్ మాటలు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని బాల్క సుమన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రజలను మోసం చేయడానికే నీళ్ల అంశాన్నితెరమీదకు తెచ్చారని మండిపడ్డారు. గతేడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.






