- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ నేతలు!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించి రాజకీయంగా వైఎస్ షర్మిల మరింత క్రియాశీలకం అయ్యారు. నిరుద్యోగుల సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర షర్మిల నిరాహారదీక్షకు దిగనున్నారు. దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే షర్మిల అనుచరులు సెంట్రల్ జోన్ డీసీపీని కోరారు. మూడు రోజుల పాటు షర్మిల నిరాహార దీక్ష చేయనుండగా.. ఆమె దీక్షకు మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలకు అనుచరులు ఆహ్వానం పంపారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించి రాజకీయంగా వైఎస్ షర్మిల మరింత క్రియాశీలకం అయ్యారు. నిరుద్యోగుల సమస్యలపై, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర షర్మిల నిరాహారదీక్షకు దిగనున్నారు. దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే షర్మిల అనుచరులు సెంట్రల్ జోన్ డీసీపీని కోరారు.
మూడు రోజుల పాటు షర్మిల నిరాహార దీక్ష చేయనుండగా.. ఆమె దీక్షకు మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలకు అనుచరులు ఆహ్వానం పంపారు. గద్దర్, కోదండరామ్, ఆర్.కృష్ణయ్‌తో పాటు పలు రాజకీయ పార్టీలకు షర్మిల అనుచరులు లేఖలు పంపారు.
మరోవైపు షర్మిల పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబర్చగా.. తాజాగా హైదరాబాద్‌లోని ఫతేనగర్, బాలానగర్, ఓల్డుబోయినపల్లి, కూకట్‌పల్లి, మూసాపేటకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు షర్మిల పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు.






