- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమావేశంలో కార్యదర్శితో రచ్చ.. పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్
<p>దిశ, హుస్నాబాద్: గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ కార్యదర్శికి, సర్పంచ్ కు జరిగిన వాగ్వాదం.. సర్పంచ్ ప్రాణాల మీదకు తెచ్చింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణంపై గ్రామ పాలకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శ్రీరాములపల్లి సర్పంచ్ ముంజ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల […]</p>

దిశ, హుస్నాబాద్: గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ కార్యదర్శికి, సర్పంచ్ కు జరిగిన వాగ్వాదం.. సర్పంచ్ ప్రాణాల మీదకు తెచ్చింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణంపై గ్రామ పాలకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
శ్రీరాములపల్లి సర్పంచ్ ముంజ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో సర్పంచ్ మంజులకు, గ్రామ కార్యదర్శి సుమలతకు మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గొడవతో మనస్థాపానికి గురైన సర్పంచ్ మంజుల గ్రామ పంచాయతీకి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






