ఖలీల్-తెవాతియా మధ్య గొడవ

by  |
ఖలీల్-తెవాతియా మధ్య గొడవ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అపశృతి దొర్లింది. రాజస్థాన్ ఛేజింగ్ చివరి ఓవర్‌లో హైదరాబాద్ పేసర్ ఖలీల్, రాజస్థాన్ బ్యాట్స్‌మాన్ రాహుల్ తెవాతియా మధ్య మాటల యుద్దం నడిచింది. చివరి ఓవర్ నాలుగో బంతి తర్వాత మాటల యుద్దం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కనపడింది. తెవాతియా చాలా కోపంగా మాట్లాడుతుండటంతో డేవిడ్ వార్నర్ వెళ్లి అతడిని సముదాయించాడు. అదే సమయంలో అక్కడ అంపైర్ కూడా ఉన్నాడు. దీంతో తెవాతియా వివాదాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు తెవాతియా భుజంపై ఖలీల్ చేయి వేసి మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూం వైపు వెళ్లడం టీవీల్లో కనిపించింది.



Next Story

Most Viewed