- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అటవీశాఖ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన పోలీస్.. రోడ్డుపై కొట్లాట
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ అటవీశాఖ ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కర్ఫ్యూ సమయంలో కాస్త దారి తీయమన్నందుకు గూబగుయ్ మనిపించాడు. సోమవారం మదనపల్లెలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో విధులు ముగించుకుని ఏబీవో రామయ్య ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. బస్టాండ్ దగ్గర అడ్డంగా బారికేడ్లు ఉంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ విధులు నిర్వహిస్తున్నారు. కాస్త దారిస్తే వెళ్తానని రామయ్య కోరగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ అటవీశాఖ ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. కర్ఫ్యూ సమయంలో కాస్త దారి తీయమన్నందుకు గూబగుయ్ మనిపించాడు. సోమవారం మదనపల్లెలో మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో విధులు ముగించుకుని ఏబీవో రామయ్య ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. బస్టాండ్ దగ్గర అడ్డంగా బారికేడ్లు ఉంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ జగదీశ్ విధులు నిర్వహిస్తున్నారు.
కాస్త దారిస్తే వెళ్తానని రామయ్య కోరగా జగదీశ్ నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశానికి గురైన కానిస్టేబుల్ ఏబీవో రామయ్య చొక్కా పట్టుకుని చెంపపై కొట్టాడు. అటవీ శాఖ ఉద్యోగి రామయ్య కూడా కొట్టాడు. దీంతో ఇద్దరూ కొట్టుకున్నారు. పక్కనే ఉన్న స్థానికులు కలుగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు.
Next Story






