- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యూటీ చేసే చోట గొడవ.. అదృశ్యమైన యువతి.. అసలేం జరిగింది…?
<p>దిశ, కుత్బుల్లాపూర్ : పేదరికంలో ఉన్న కుటుంబం కోసం పనికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామానికి చెందిన వెంకట్ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థికంగా వెనుకబడింది. అయితే అతని కుమార్తె అనూజ(18) కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటీవలే ప్రారంభమైన సుచిత్ర లోని కిసాన్ షోరూమ్ లో పనికి కుదిరింది. అయితే రోజు మాదిరిగానే ఈనెల 23వ […]</p>

దిశ, కుత్బుల్లాపూర్ : పేదరికంలో ఉన్న కుటుంబం కోసం పనికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామానికి చెందిన వెంకట్ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థికంగా వెనుకబడింది. అయితే అతని కుమార్తె అనూజ(18) కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటీవలే ప్రారంభమైన సుచిత్ర లోని కిసాన్ షోరూమ్ లో పనికి కుదిరింది.
అయితే రోజు మాదిరిగానే ఈనెల 23వ తేదీన డ్యూటీకి వెళ్లిన అనూజ రాత్రైనా ఇంటికి రాలేదు. ఏమైందని కుటుంబ సభ్యులు షోరూమ్ కు వెళ్లి అడుగగా 23వ తేదీన షోరూమ్ లో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై పని చేసే వారితో పాటు యాజమాన్యంను అడుగగా సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనం లేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






