- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆంధ్రకు తరలిస్తున్న మద్యం పట్టివేత
by Nalla Sampath Reddy |
<p>దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ నుంచి ఆంధ్రకు మద్యం తరలిస్తున్న నిందితుడు జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణా జిల్లా కలిదిండి మండల కేంద్రానికి చెందిన కాసాని బలరాం(55) జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి షాపూర్ నగర్ లోని న్యూ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా గల కామాక్షి ట్రాన్స్పోర్ట్ లో కూలిగా పని చేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం కొరత ఉన్న విషయాన్ని ఆసరాగా చేసుకొని మద్యాన్ని […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ నుంచి ఆంధ్రకు మద్యం తరలిస్తున్న నిందితుడు జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణా జిల్లా కలిదిండి మండల కేంద్రానికి చెందిన కాసాని బలరాం(55) జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి షాపూర్ నగర్ లోని న్యూ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా గల కామాక్షి ట్రాన్స్పోర్ట్ లో కూలిగా పని చేస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం కొరత ఉన్న విషయాన్ని ఆసరాగా చేసుకొని మద్యాన్ని పంపి వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఇదిలా ఉండగా ఓ డీసీఎం లో మందును తరలిస్తూ షాపుర్ నగర్ లో నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతని వద్ద లక్ష రూపాయల విలువైన 120 ఫుల్ బాటిల్లు, 150 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






