- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్షన్.. టెన్షన్.. పీడీఎస్ ఆఫీసులోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు
<p>దిశ, ఖైరతాబాద్ : పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు కిసాన్ కాంగ్రెస్ ఆందోళనకు దిగారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంతోపాటు, బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన […]</p>

X
దిశ, ఖైరతాబాద్ : పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు కిసాన్ కాంగ్రెస్ ఆందోళనకు దిగారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంతోపాటు, బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలను, పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పంట కొనుగోలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






