- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉల్లంఘనలపై వారికి ఫిర్యాదు చేయండి….
<p>దిశ,సిద్దిపేట: నిష్పక్ష పాతంగా, ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఎన్నిక నిర్వహించేందుకు జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్‌ను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. పోలింగ్ ముగిసే వరకు సిద్దిపేట విద్యుత్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్ అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక ఎన్నిక […]</p>

దిశ,సిద్దిపేట:
నిష్పక్ష పాతంగా, ప్రశాంత వాతావరణంలో దుబ్బాక ఎన్నిక నిర్వహించేందుకు జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్‌ను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. పోలింగ్ ముగిసే వరకు సిద్దిపేట విద్యుత్ గెస్ట్ హౌస్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్ అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. దుబ్బాక ఎన్నిక లకు సంబంధించిన అంశాల పై ముందస్తు అపాయింట్ మెంట్ తో సాధారణ వ్యయ పరిశీలకులు శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు కలువ వచ్చునని తెలిపారు. నేరుగా వచ్చి కలువలేని వారు సాధారణ పరిశీలకులు శ్రీమతి డా. శ్యామ్లా ఇక్బాల్ ను 9515184620 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు. దుబ్బాక శాసన నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఏమైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఫిర్యాదులుంటే ఎన్నికల సాధారణ పరిశీలకులకు తెలియజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రామి రెడ్డి తెలిపారు.






