ఏపీ మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో : పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అడ్వకేట్ భూక్యా మల్లికార్జున రావు ఆదివారం మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్440కే కొత్తరకం వైరస్ పుట్టిందని, ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని మంత్రి అప్పలరాజు చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు మల్లికార్జున రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వైరస్‌ అంత ప్రమాదకారి కాదని సీసీఎంబీ పరిశోధనలో తేలిందని [&hellip;]</p>

Minister Appalaraju
X

దిశ, ఏపీ బ్యూరో : పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అడ్వకేట్ భూక్యా మల్లికార్జున రావు ఆదివారం మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్440కే కొత్తరకం వైరస్ పుట్టిందని, ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని మంత్రి అప్పలరాజు చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు మల్లికార్జున రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వైరస్‌ అంత ప్రమాదకారి కాదని సీసీఎంబీ పరిశోధనలో తేలిందని వివరించారు. మంత్రి పదవిలో ఉండి ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేసిన మంత్రి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో కోరారు.

Next Story