- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. ఎంపీ కోమటిరెడ్డికి భారీ షాక్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. టీపీసీసీ ప్రకటన తర్వాత నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ అంశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇటీవల వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లవద్దంటూ టీపీసీసీ ప్రకటించింది. కానీ, ఎంపీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. టీపీసీసీ ప్రకటన తర్వాత నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ అంశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇటీవల వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లవద్దంటూ టీపీసీసీ ప్రకటించింది. కానీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత ఎంఏ ఖాన్ హాజరయ్యారు.
వీరిపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఏఐసీసీ నిర్ణయించాలంటూ వివరించారు. ప్రస్తుతం ఈ విషయం కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






