పగలు స్త్రీని కొలిచే భారతీయులు.. రాత్రయితే? : వైరల్‌గా వీర్ దాస్ వీడియో

by  |
పగలు స్త్రీని కొలిచే భారతీయులు.. రాత్రయితే? : వైరల్‌గా వీర్ దాస్ వీడియో
X

దిశ, సినిమా : ప్రముఖ యూట్యూబర్, కమెడియన్ వీర్ దాస్ సోమవారం అప్‌లోడ్ చేసిన ‘ఐ కమ్ ఫ్రమ్ టు ఇండియాస్’ వీడియో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో భారీ విమర్శలు ఎదుర్కొంటున్న వీర్ దాస్.. ఇప్పుడు లీగల్‌ గానూ సమస్యల్లో చిక్కుకున్నాడు. దేశాన్ని కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ.. ఢిల్లీలోని తిలక్ మార్గ్‌ పోలీస్ స్టేషన్‌‌లో తనపై కేసు నమోదైంది. ఈ వీడియోలో ‘పగలు స్త్రీని కొలిచే భారతీయ పురుషులు.. రాత్రయితే తననే రేప్ చేస్తారు’ అనే స్టేట్‌మెంట్‌పై తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుండగా.. దాదాపు ఏడు నిమిషాల మోనోక్రోమ్‌లో భారత్‌లో రేప్ కేసులు, కొవిడ్ 19 పరిస్థితులు, అన్నదాతల ఆందోళనపై చర్చించాడు.

కాగా దీనిపై స్పందించిన కంగనా రనౌత్.. ఈ వీడియోలో భారతీయ పురుషులందరినీ నార్మలైజ్ చేసి మాట్లాడటాన్ని తప్పుబట్టింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులపై జాత్యహంకార దాడులు, బెదిరింపులను పెంచగలదని అభిప్రాయపడింది. బెంగాల్ కరువు తర్వాత విన్‌స్టన్ చర్చిల్ భారత జాతిని ఉద్దేశిస్తూ.. ‘ఈ ఇండియన్స్ కుందేళ్ల మాదిరి సంతానోత్పత్తికి పాల్పడి లక్షలాది మంది ఆకలితో చనిపోయేందుకు కారణమవుతారని నిందించాడు. ఇప్పుడు వీర్ దాస్ సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేసి సాఫ్ట్ టెర్రరిజానికి పాల్పడ్డాడు’ అని అభిప్రాయపడింది. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.



Next Story