- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేపాల్ పీఎం బహిష్కరణ
by B.Srinivas |
<p>న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని కేపీ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్‌సీపీ) నుంచి బహిష్కరించారు. ఎన్‌సీపీ కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఓలి సభ్యత్వాన్ని తొలగించినట్టు పార్టీ నేత నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు. నేపాల్ పార్లమెంటు రద్దుపై పీఎం కేపీ ఓలి ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాలు వేగంగా మలుపుతిరిగాయి. పార్లమెంటు రద్దుకు గల కారణాలను తెలియజేయాల్సిందిగా తాము పలుసార్లు ఆదేశించినప్పటికీ సమాధానమివ్వలేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, ఆయనకు కమ్యూనిస్టు పార్టీ […]</p>

X
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని కేపీ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్‌సీపీ) నుంచి బహిష్కరించారు. ఎన్‌సీపీ కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఓలి సభ్యత్వాన్ని తొలగించినట్టు పార్టీ నేత నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు. నేపాల్ పార్లమెంటు రద్దుపై పీఎం కేపీ ఓలి ఏకపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాలు వేగంగా మలుపుతిరిగాయి.
పార్లమెంటు రద్దుకు గల కారణాలను తెలియజేయాల్సిందిగా తాము పలుసార్లు ఆదేశించినప్పటికీ సమాధానమివ్వలేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, ఆయనకు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని పార్టీ నేతలు తెలిపారు. పీఎం కేపీ ఓలి పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు ఎన్నికలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story






