రా! వచ్చి ముద్దుపెట్టు.. ఆ హీరోయిన్ బంపర్ ఆఫర్

by  |
రా! వచ్చి ముద్దుపెట్టు.. ఆ హీరోయిన్ బంపర్ ఆఫర్
X

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ షమిత శెట్టి, రాకేష్ బాపట్ మధ్య కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎంతలా పెరిగిపోయిందో రీసెంట్‌గా రిలీజైన ప్రోమో వీడియోలో చూపించారు. హౌస్‌లో షమితా షెట్టి భోజనం చేస్తున్న సమయంలో రాకేష్.. మైక్రోవేవ్‌లో ఏదో ఫుడ్ ఐటమ్‌ను వేడిచేస్తూ కనిపించాడు. అయితే దాన్ని ఎక్కువగా వేడిచేయొద్దని, అలాచేస్తే గట్టిగా తయారవుతుందని షమిత చెప్తుంది. ఇంతలో తన దగ్గరకు వచ్చిన రాకేష్, ఇంకా ఏమైనా చేయాలా? అని అడగడంతో, సీరియస్ లుక్ ఇచ్చిన షమిత.. తను చెప్పింది చేయడం ప్రాబ్లమ్ అనిపిస్తే ఇంకోసారి చెప్పనంటుంది. దీనికే కోపమెందుకని ప్రశ్నించిన రాకేష్‌ను.. ఇక్కడకు వచ్చి వెంటనే ముద్దు పెట్టమనగా, అతను షమిత బుగ్గపై కిస్ చేయడంతో కూల్ అవుతుంది. ఇక ఈ క్యూట్ మూమెంట్‌ను చూసిన సింగర్ నేహా భాసిన్ ‘సో క్యూట్’ అంటూ కామెంట్ చేయడం వీడియోలో చూడొచ్చు.

ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో రాకేష్, షమితలు క్లోజ్‌గా మూవ్ అవడాన్ని ఫ్యాన్స్ చూశారు. పొద్దున్నే రాకేష్ ఆమెను ముద్దుతో లేపడం, తనతో కలిసి బెడ్ మీద జంప్ చేస్తూ.. ఇక్కడే పడుకోవచ్చా? అని అడగడం వంటి ఇంటిమేట్ మూమెంట్స్‌తో స్పెషల్ అటెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed