- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం కలెక్టర్ ఎ. శరత్ పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, మంచి నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని మూడెకరాల ఖాళీ స్థలంలో 18 రకాల పండ్ల మొక్కలను నాటాలన్నారు. అటు కామారెడ్డి పట్టణంలో పర్యటించిన […]</p>

X
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం కలెక్టర్ ఎ. శరత్ పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురుగు కాలువలు, మంచి నీటి ట్యాంకులు శుభ్రంగా ఉంచుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని మూడెకరాల ఖాళీ స్థలంలో 18 రకాల పండ్ల మొక్కలను నాటాలన్నారు. అటు కామారెడ్డి పట్టణంలో పర్యటించిన కలెక్టర్ 15,16,17 వార్డుల్లో మురుగు కాలువలను పరిశీలించారు. రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు, చెత్త చెదారం లేకుండా చూడాలని, విధులు సక్రమంగా నిర్వహించని వారిని తొలగించాలని కమిషనర్ దేవేందర్‌ను ఆదేశించారు.
Next Story






