- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్: ఈటలపై కలెక్టర్ సంచలన నివేదిక
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల భూ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సీఎస్‌కు చేరింది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఈ నివేదికను అందించారు. మొత్తం 20 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితుల వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చారు. మంత్రి ఈటలకు చెందిన జమునా హాచరీస్ 66.01 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్లు సూచించారు. మొత్తం 315.30 ఎకరాల భూమి ఉండగా… ఇందులో 121.27 ఎకరాల భూమిని ఆదీనంలో పెట్టుకున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఈటల భూ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదిక సీఎస్‌కు చేరింది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఈ నివేదికను అందించారు. మొత్తం 20 మంది బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితుల వివరాలన్నింటినీ నివేదికల్లో పొందుపర్చారు. మంత్రి ఈటలకు చెందిన జమునా హాచరీస్ 66.01 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్లు సూచించారు.
మొత్తం 315.30 ఎకరాల భూమి ఉండగా… ఇందులో 121.27 ఎకరాల భూమిని ఆదీనంలో పెట్టుకున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. మరో 3.11 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రహారీ గోడను నిర్మాణం చేసినట్లు రిపోర్ట్‌లో వివరించారు. మంత్రి ఈటలకు సంబంధించిన జమునా హాచరీస్ ఈ భూములను కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అసైన్డ్ ల్యాండ్ నుంచే రోడ్డు నిర్మాణం చేశారని, వాల్టా చట్టానికి విరుద్ధంగా చెట్లు నరికివేసినట్లు ఫారెస్ట్ అధికారుల విచారణలో తేలిందని కలెక్టర్ నివేదికల్లో పేర్కొన్నారు. వ్యవసాయ భూమిలో నాలా చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని నివేదికల్లో వెల్లడించారు. ఈ నివేదికను సీఎస్‌కు సమర్పించారు.






