- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పనులు చేపట్టాలి : కలెక్టర్ శరత్
<p>దిశ, నిజామాబాద్: గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని జనహిత హాలులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్ స్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కూలీలు పనులు చేసేలా చూడాలని అధికారులను కోరారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్ లను తయారు చేయించాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మాస్క్‌లను తయారు చేయాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి […]</p>

దిశ, నిజామాబాద్: గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని జనహిత హాలులో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్ స్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కూలీలు పనులు చేసేలా చూడాలని అధికారులను కోరారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్ లను తయారు చేయించాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మాస్క్‌లను తయారు చేయాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి 100 శాతం పాస్ పోర్టులను తహసీల్దారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఉచిత బియ్యం పంపిణీ మంగళవారం మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలన్నారు. బియ్యం పంపిణీ పూర్తి చేయని డీలర్లు సంబంధిత తహసీల్దారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మంగళవారం సాయంత్రం జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించారు. బాన్సువాడలో పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డుల్లో తడి, పొడి చెత్తను సేకరించాలన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు సంచార వాహనాల ద్వారా ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి శాంపిళ్లను మంగళవారం ఉదయం వరకు 100శాతం సేకరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్వేతా, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీవో చంద్రమోహన్ రెడ్డి, డీపీవో సాయన్న, జిల్లా ఆరోగ్య మిషన్ అధికారిణి విశాల రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: corona, lockdown, upadi hami works, collector sharath video conference






