- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జూన్ 2 నాటికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఈ- ఆఫీస్ విధానంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీసు విధానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా పారదర్శకత ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన పేపర్లు, ఇతర డాక్యుమెంట్లు మిస్ కాకుండా ఉంటాయని చెప్పారు. ఇదివరకే జిల్లా […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జూన్ 2 నాటికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఈ- ఆఫీస్ విధానంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీసు విధానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా పారదర్శకత ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన పేపర్లు, ఇతర డాక్యుమెంట్లు మిస్ కాకుండా ఉంటాయని చెప్పారు. ఇదివరకే జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాల్లో ఈ- ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే మండల స్థాయిలో కూడా ఈ ఆఫీస్ విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Tags: collector, e-office system, mahabubnagar
Next Story






