- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హరితహారంలో నిర్లక్ష్యాన్ని సహించను’
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు మొక్కలు నాటాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఆయా శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే మొక్కలు నాటేందుకు సమయం ఉన్నందున మొక్కలు నాటడం మిషన్ మోడ్‌లో చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంతో వెనుకంజలో ఉన్న […]</p>

X
దిశ, కొత్తగూడెం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు మొక్కలు నాటాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఆయా శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే మొక్కలు నాటేందుకు సమయం ఉన్నందున మొక్కలు నాటడం మిషన్ మోడ్‌లో చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంతో వెనుకంజలో ఉన్న అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లక్ష్య సాధనలో అలసత్వం వహించడంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్టు ఆయన చెప్పారు. నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేయడం వల్ల జవాబుదారీతనం ఉంటుందని చెప్పారు.
Next Story






