ఐటీసీ విరాళాలు అందించడం అభినంద‌నీయం: క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి

by  |
ఐటీసీ విరాళాలు అందించడం అభినంద‌నీయం: క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి
X

దిశ‌, ఖ‌మ్మం: కరోనా వ్యాధి నియంత్రణలో విశిష్ట సేవలు అందజేస్తోన్న వైద్య సిబ్బందికి ఐటీసీ సంస్థ రూ. లక్షల విలువైన పోషక పదార్థాలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి కొనియాడారు. ఐదు రకాల వస్తువులతో కూడిన కిట్‌ను ఆ సంస్థ ప్ర‌తినిధులు చెంగ‌ల్‌రావు క‌లెక్ట‌ర్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఐటీసీ అధికారులు అందజేసిన పోష‌కాహార వ‌స్తువులను జిల్లా వైద్యాధికారి ద్వారా వైద్య సిబ్బందికి పంపిణీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ మేర‌కు డీఎం అండ్ హెచ్‌వోను పంపిణీ చేయాల‌ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే వెంకటేశ్వర్లు, ఆర్డీవో అశోక చక్రవర్తి, ఐటీసీ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

tag: Collector MV Reddy, Appreciated, ITC Donation, bhadradri kothagudem

Next Story

Most Viewed