- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలాలపై మూతలు వేయాలి : కలెక్టర్
<p>దిశ, మెదక్: మెదక్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిఒక్కరూ పాటుపడాలని మెదక్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం ఏరియాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్‌తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. డివైడర్లను, రోడ్డు పక్కన ఉన్న నాలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మెదక్ పట్టణాన్ని నందనవనంగా తీర్చదిద్దేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలని […]</p>

దిశ, మెదక్: మెదక్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిఒక్కరూ పాటుపడాలని మెదక్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం ఏరియాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్‌తో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. డివైడర్లను, రోడ్డు పక్కన ఉన్న నాలాలను పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
మెదక్ పట్టణాన్ని నందనవనంగా తీర్చదిద్దేందుకు ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలని తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. డివైడర్లలో అవసరమైన మొక్కలు నాటాలని, అలాగే రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను నాటాలని సూచించారు. మురికి కాలువలు తెరిచి ఉంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాటిని మూసివేయాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.






