బాధ్యతలు స్వీకరించిన మెదక్ కలెక్టర్..

by  |
బాధ్యతలు స్వీకరించిన మెదక్ కలెక్టర్..
X

దిశ, మెదక్: మెదక్​ జిల్లాను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మెదక్ జిల్లా కలెక్టర్​ ఎం.హనుమంతరావు అన్నారు. మెదక్​ జిల్లా కలెక్టర్​గా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఏడుపాయలలో కలెక్టర్​కు ఆలయ ఈఓ శ్రీనివాస్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దుర్గామాతకు కలెక్టర్​ హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదుర్గామాత అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని అన్నారు. జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించే ముందు దుర్గామాతను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ అన్నారు.


Next Story

Most Viewed