కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో వసతులు కల్పించాలి

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లోకి మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున వాహనాలు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన సౌకర్యాలను వీలైనంత త్వరగా కల్పించాలని కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ హరీశ్‌తో కలిసి కలెక్టర్ అమయ్ గురువారం మార్కెట్‌ను సందర్శించారు. కోహెడ మార్కెట్‌కు ప్రతిరోజు 50కి పైగా మామిడి కాయల లోడుతో లారీలు వచ్చే అవకాశం ఉందని [&hellip;]</p>

కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో వసతులు కల్పించాలి
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లోకి మరికొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున వాహనాలు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన సౌకర్యాలను వీలైనంత త్వరగా కల్పించాలని కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ హరీశ్‌తో కలిసి కలెక్టర్ అమయ్ గురువారం మార్కెట్‌ను సందర్శించారు. కోహెడ మార్కెట్‌కు ప్రతిరోజు 50కి పైగా మామిడి కాయల లోడుతో లారీలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చీపోయే రైతులకు, కొనుగోలుదారులు, వ్యాపారులు, సాధారణ ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags: Rangareddy, Koheda Fruit market, collector Amay kumar, visit, Infrastructure

Next Story